జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పుష్ప 2 పై ఫిర్యాదు..!

-

జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన పై ఫిర్యాదు నమోదయ్యింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసాడు యుగేందర్ గౌడ్. ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పిన పట్టించుకోలేదు. నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలి కాగా మరో పసి ప్రాణం ప్రమాదంలో ఉంది. కాబట్టి పుష్ప 2 చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.

అయితే ఈ పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటన పై అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పై ఉన్నత అధికారులు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. చూడాలి మరి ఇందులో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news