చాణక్యుడు జీవితంలో ఏ విధంగా వ్యవహరించాలో ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. చాణక్య నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన ఎంతో మంచి దారిలో నడవచ్చు. అయితే, అటువంటి సలహాలను పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. జీవితంలో ఇతరులు ఇచ్చిన సలహాలను పాటించడం వలన కూడా మంచి దారిలో నడచుకోవచ్చు. కానీ, ఇతరుల సలహాలను తీసుకున్న తరువాత ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలి. చాణక్యుడు ప్రకారం మూర్ఖుల నుండి సలహాలు తీసుకోవడం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.
కొంతమంది స్వార్థపరులు వారికి మాత్రమే మంచి కోరుకుంటారు దీని వలన ఇతరుల అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులు ఇచ్చిన సలహాలను తీసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా, స్వార్థపరులు తప్పుడు సలహాలను ఇస్తారు కనుక వారి మాటలను అస్సలు పట్టించుకోకూడదు. ఎలాంటి అనుభవం లేకుండా సలహాలను సూచించే వ్యక్తుల మాటలను తేలికగా నమ్మకూడదు. అటువంటి సలహాలను పాటించడం వల్ల మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. ప్రతి ఒక్కరు ఒకే విధంగా ఆలోచించరు, అయితే నెగటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ఇచ్చే సలహాలు కేవలం నష్టాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాయి.
ఇలాంటి సలహాలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది అని చాణక్యుడు చెప్పడం జరిగింది. కొంతమంది ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి వచ్చిన సలహాలను పాటించకపోవడమే మేలు. ఎందుకంటే అసూయపడే వ్యక్తులు ఇచ్చే సలహాలు తప్పుడు దారిలో నడిపిస్తాయి. అందువలన అటువంటి సలహాలు ఎట్టి పరిస్థితుల్లో పాటించకూడదు అని చాణక్యుడు చెప్పడం జరిగింది. కనుక ఇటువంటి వ్యక్తుల నుండి సలహాలను తీసుకోకుండా, సొంత నిర్ణయాలను తీసుకోవడం వలన జీవితం ఎంతో బాగుంటుంది.