జీవితంలో అలసిపోయానని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా ? ఐతే ఇది చదవాల్సిందే.

-

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అందుకే అవతలి వారికి జరిగినట్లు నాకెందుకు జరగట్లేదని బాధపడకూడదు. నీలో శక్తి ఉంది. దాన్ని నువ్వు నమ్మాలి. అలసిపోయానని, విసిగిపోయానని సాకులు చెబుతూ కూర్చుంటే పని పూర్తి కాదు. ఇది జీవితం.. పయనించాలంతే. గెలుపు కోసం ఎదురుచూడకుడదు. పనిచేసుకుపోవాలంతే.

 

రోజూ ఉదయం లేవగానే నాకు విజయం ఎప్పుడు వస్తుంది? నేనెప్పటికీ ఇలా ఉండాల్సిందేనా అన్న విషయాలు గుర్తు చేసుకోకూడదు. దానికన్నా నేను చాలా బలం కలవాడిని. కావాల్సినంత తెలివి ఉంది. పనిచేయడానికి శక్తి ఉంది. నేను సాధించి తీరతాను అన్న నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం గెలుపు మీద కన్నా పనిమీద ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది.

ఆ ఆసక్తి లేనపుడు గెలుపు ఎప్పుడూ అందని ద్రాక్షే అవుతుంది. దాంతో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ప్రారంభిస్తావు. నావల్ల చేతకాదు, నాకేమీ రాదు. నేనింతే, కొన్ని డబ్బులుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు వంటి మాటలన్నీ మాట్లాడి నీలో ఉన్న అపారమైన శక్తిని గుర్తించకుండా ఐపోతావు.

అందుకే ఎప్పుడైనా సరే, అలసిపోవద్దు. పరుగెత్తాలి. గెలవాలన్న కాంక్షతోనో, గెలవకపోతే ఏమవుతుందోనన్న భయంతోనో కాదు, పరుగు అంటే ఇష్టంతో పరుగెత్తాలి. అప్పుడే గెలుపు వల్ల వచ్చే సంతోషం కన్నా పరుగెత్తిన దానివల్ల కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది.

అందుకే జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ అలసిపోయానని ఎప్పుడూ మాట్లాడకండి. పొదున్న లేవగానే మీకు మీరే బలం ఇచ్చుకోవాలి. నేను బాగున్నాను, ఈ రోజు ఇంత బాగున్నాను. రేపు ఇంకా బాగుండాలి అనుకోవాలి. అలా అనుకుంటూ పనిచేసుకుమ్టూ పోతుంటె అలుపన్నది రాదు. గెలుపన్నది సొంతం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version