భార్యాభర్తల మధ్య ప్రేమా అనేది ఒక అందమైన ప్రయాణం. కానీ దాన్ని బలంగా సంతోషంగా ఉంచడానికి కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఈరోజుల్లో ఎక్కువమంది పెళ్లి అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా లేకపోవడం. పార్ట్నర్ తో ఉండే రిలేషన్షిప్ లో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఈ నియమాలు సంబంధాన్ని సమానంగా ఉంచడమే కాక ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి. మరి అలాంటి నియమాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాం..
ఓపెన్ కమ్యూనికేషన్: భార్యాభర్తలు మధ్య నిజాయితీ దెబ్బతినకుండా ఉండాలి. మనం మాట్లాడే మాటలు పార్ట్నర్ మనపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టేలా ఉండాలి. మీ భావాలు మీ ఆలోచనలు సమస్యలను బహిరంగంగా మాట్లాడండి. భాగస్వామి మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ఓపిగ్గా కొంత సమయం ఇవ్వండి. ఒకరి మాటలు ఒకరు గౌరవించడం సంబంధానికి గట్టి పునాది అవుతుంది.
గౌరవం ప్రేమకు ఆధారం: ఒకరి వ్యక్తిత్వం అభిప్రాయాలు స్వేచ్ఛను గౌరవించడం ద్వార రిలేషన్షిప్ లో సంబంధం బలపడుతుంది. పాట్నర్ ను అవమానించడం,తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చిన్న విషయాలను కూడా వారిని హేళనగా చూడడం, వంటి చర్యలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి ప్రేమను తగ్గిస్తాయి.
నమ్మకం సంబంధానికి ఊపిరి: భార్యాభర్తల సంబంధం లో నమ్మకం లేని సంబంధం గాలిలో కోట లాంటిది. ఒకరిపై అనుమానాలు అసూయ లేకుండా నిజాయితీగా ఉండడం ఒకరి గోప్యత ను గౌరవించడం వారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం, వాగ్దానాలు నిలబెట్టడం నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకమే మీ బంధానికి ఊపిరిగా మారి జీవితాంతం ఒకరినొకరు సంతోషంగా ఉండేలా చూస్తుంది.

సమయం: ప్రేమకు సమయం కేటాయించాలి ఈ బిజీ లైఫ్ లో కొంత సమయం బాగా స్వామికి కేటాయించడం ఎంతో ముఖ్య వారితో కలిసి భోజనం చేయడం సరదాగా సినిమా చూడడం కొంత సమయం నీకోసమే అని వారికి అర్థమయ్యేలా చేయడంతో చిన్న చిన్న క్షణాలు పెద్ద జ్ఞాపకాలుగా వారి జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
క్షమాపణ : సహజంగా మనిషి తప్పులు చేయకుండ ఉండడు, చిన్నచిన్న తప్పులు మానవ జీవితంలో సహజంగా రోజువారిలో జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఒప్పుకోవడం పార్ట్నర్ ని క్షమించమని అడగడం పెద్ద మనసుకు నిదర్శనం. తప్పు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు రాజీ పడడం పరిష్కారం. అహంకారం సంబంధానికి విషయం లాంటిది, క్షమాపణ మందు లాంటిది.
సపోర్ట్: భాగస్వామి కలలు, వారి లక్ష్యానికి మద్దతుగా నిలవండి కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వండి ఎటువంటి సమస్యనైనా మీతో చెప్పుకునే సమయాన్ని ఇవ్వండి. విజయాలను కలిసి కుటుంబంతో పంచుకోండి. ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉండి సపోర్టుగా నిలబడితే ఆ బంధం బలంగా నిలుస్తుంది.
సంబంధం అనేది ఇద్దరు కలిసి నడిచే ప్రయాణం నిజాయితీ, గౌరవం, నమ్మకం, సమయం, క్షమాపణ మద్దతుతో ఈ ప్రయాణం సంతోషకరంగా దీర్ఘకాలికంగా సాగుతుంది. ఈ చిన్న నియమాలు పాటిస్తే మీ సంబంధం ఎప్పటికీ మీ భాగస్వామితో మధురంగా నిలిచిపోతుంది.