గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ప్రజలు వారి ప్రాణాల కోసం భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు విపరీతంగా కురవడంతో కొన్ని ప్రాంతాలలో రోడ్ల పైన వెళ్లే జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులపాటు సెలవులు పొడిగిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని అన్నారు. ఈ సంవత్సరంలోనే దాదాపు 1300 కోట్ల రూపాయలను రహదారుల అభివృద్ధికి వినియోగించామని మంత్రి సంధ్యారాణి అన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. వర్షాలు ఎక్కువైనట్లయితే సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తామని ఏపీ మంత్రి సంధ్యారాణి అన్నారు.