పిల్లల పెంపకం లో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలక . పిల్లల పై ప్రేమ చూపించటమే కాదు, వారికి భాద్యతలు నేర్పించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా నిర్వర్తించవలసిన భాద్యతలూ గురించి తెలుసుకోవాలి.
. తోబుట్టువుల మధ్య అంతరాలు ఉండకుండా చేయాలి. ముఖ్యంగా పోలికలు పెట్టకూడదు.
. వీలు దొరికిన ప్రతి సారి పిల్లల్ని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. దీని ద్వారా వారిలో నూతన ఉత్సాహన్ని నింపుతుంది.
. పిల్లల్ని ప్రశ్నలు అడుగుతుండాలి. వారి నుంచి సమాధానాలు రాబట్టాలి. వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడం తల్లిదండ్రుల బాధ్యత.
. 6-7 ఏళ్ల వయస్సు దాకా చూసిన ప్రతి విషయం పిల్లల మెదళ్లలో నిలిచిపోతుంది. ఆ ప్రభావం వారి వ్యక్తిత్వం మీద చాలా ఉంటుంది. ఈ సమయంలో వారి పై కోపం ప్రదర్శించడం గానీ అరవడం లాంటివి చేయకూడదు.
. పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ వారి బాలలు , బలహీనతలను గుర్తించి వారికిష్టమైన వాటి మీద ప్రోత్సహించాలి.
. పిల్లల ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడి గురిచేయడం మంచిది కాదు. చిన్నతనంలోనే ఒత్తిడికి గురైన తర్వాత కాలంలో వారు బాగా రాణించలేరు.
. పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకు కృషి చేయాలి. వారి ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలి.
. మంచి పని చేసినప్పుడు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. వారికి బహుమతులు ఇవ్వాలి.