రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టిన హరీష్‌ రావు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. ఇక అసెంబ్లీ ప్రారంభం కాగానే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు 2022-23 బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్‌ ను మంత్రి హరీష్‌ రావు ప్రవేశ పెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్‌ కోతలు, ఆకలిచావులు ఇప్పుడు లేవని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. రాష్ట్ర పునః నిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్‌ తన భుజాలపై వేసుకున్నారని కొనియాడారు. తన ప్రసంగం ఆది నుంచే కేంద్ర ప్రభుత్వంపై దాడి చేస్తూనే మాట్లాడారు మంత్రి హరీష్‌ రావు. కేంద్రం వైఖరి కారణంగా.. ఏటా రాష్ట్రం 25 వేల కోట్లు నష్టం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version