ప్రేమించడంలో తిరస్కారాలు అబ్బాయిలకి కొత్త కాదు. అమ్మాయిల వెంట తిరుగుతూ ప్రపోజజల్స్ పెడుతూ రిజెక్టెడ్ అనిపించుకుంటూ ఉంటారు. మొదట్లో ఇదంతా బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి అని వెతుకుతూ ఉంటారు. కానీ ఒకానొక దశలోకి వెళ్ళిన తర్వాత తమ మీద తమకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. తననెవరూ ప్రేమించరన్న భావం పెరుగుతుంది.
కానీ మీకిది తెలుసా? మీరు ప్రేమించాలనుకునే అమ్మాయి, మిమ్మల్ని ప్రేమించగలదా? మీతో స్నేహంగా ఉండగలాదా? కనీసం మీ స్నేహాన్ని కోరుకుంటుందా? అనే సమాధానాలు మీకు తెలియాలి. తెలియకుండా ఊహలు పెంచేసుకుని ఇబ్బంది పడవద్దు. ఒక మహిళ మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేందుకు పనికొచ్చే సంకేతాలు ఇక్కడ చూద్దాం.
కళ్ళు మాట్లాడతాయి
ఒక అమ్మాయి మీ స్నేహానిన్ కోరుకుంటుందని తెలిసినపుడు ఆమె కళ్ళు మీతో మాట్లాడతాయి. చాలా మటుకు తమకు ఇష్టం లేని వారి ముఖాల వైపు అమ్మాయిలు చూపు కూడా తిప్పరు. మీ వైపు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే మీతో స్నేహం చేసేందుకు పెద్దగా ఇబ్బంది లేదన్నట్టే లెక్క అనుకోవచ్చు.
శరీర బాష మారుతుంది.
సాధారణంగా తమకు ఇష్టమైన వారిని కలుసుకునేటపుడు అందంగా ఉండాలని చూస్తారు. అమ్మాయిలు కూడా అంతే. మీతో మాట్లాడ్డం వారికి ఇష్టంగా ఉన్నప్పుడు వారి శరీర భాషలో తేడా వస్తుంది. అది మీరు గమనించాలి.
మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు అడుగుతారు
మీకు సమాధానం తెలిసి ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే మీకు ప్రశ్నలు అడుగుతారు. కొన్ని సార్లు అది మీ ఇష్టాఇష్టాలు కావచ్చు. ఇంకేమైనా కావచ్చు. కానీ సమాధానం మీకు తెలుసు అన్నది వారికి తెలిసి ఉంటుంది.
మీతో స్నేహంగా ఉంటారు.
మీ పక్కన కూర్చోవడానికి పెద్దగా ఇబ్బంది పడరు. మీతో స్నేహంగా ఉండేందుకే చూస్తారు. అందుకే క్లోజ్ గా మూవ్ అవుతారు.