భార్య భర్తలు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలి అంటే తప్పకుండా ఆ బంధంలో ఎన్నో మంచి లక్షణాలు ఉండాలి. దాంతో ఎటువంటి గొడవలు రాకుండా ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు. చాలా సందర్భాలలో అవసరం లేనటువంటి విషయాలను పట్టించుకోవడం వలన ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. కనుక అవసరం లేని విషయాలను పట్టించుకోకుండా ఉంటే జీవితం ఎంతో బాగుంటుంది. దీంతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. భార్య భర్తల బంధం బాగుండాలంటే ఇతరులతో అస్సలు పోల్చుకోకూడదు. చాలా శాతం మంది ఇతరుల జీవితాలతో పోల్చుకొని అనవసరంగా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒకరితో ఒకరు పోల్చుకుంటారో మనసు చాలా బాధపడుతుంది. కనుక ఎవరి జీవితం వారిది అని గుర్తుంచుకొని జీవించాలి.
చాలా శాతం మందికి ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా మీ పార్ట్నర్ నుండి ఏమైనా ఆశించి, అది అనుకున్నట్టు జరగకపోతే మరింత బాధపడాల్సి వస్తుంది. కనుక పార్ట్నర్స్ నుండి ఎటువంటివి ఆశించకూడదు. అప్పుడే ప్రశాంతకరమైన జీవితం ఉంటుంది. పైగా ఆశించడం వలన ఎక్కువ గొడవలు కూడా అవుతాయి. చాలా మంది విడిపోవడానికి కారణం అనుమానం. భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే అనుమానం తగ్గుతుందో, అప్పుడే బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం అనుమానం.
కాబట్టి మీ పార్ట్నర్ ను అనుమానించకుండా ఒకరి పై ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి. అలా అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా విడిపోకుండా కలిసి జీవించగలుగుతారు. భార్యాభర్తలు కలిసి ఆనందంగా జీవించాలి అంటే వారి మధ్య ఎటువంటి విషయంలో కూడా అసూయ ఉండకూడదు. ఎప్పుడైతే మీ పార్ట్నర్ తో ఎటువంటి సందర్భంలో అయినా కలిసి ఉంటారో అప్పుడే ఆ బంధం బలంగా ఉన్నట్టు. ఎందుకంటే మీ పార్ట్నర్ విజయాలకు అసూయపడడం వలన మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఈ పార్ట్నర్ దేనినైనా సాధించినప్పుడు మీరు సంతోషంగా ఆ విజయాన్ని జరుపుకోవాలి.