ఒకే వేదిక పై మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ సీఎంలు..!

-

ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దావోస్  పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  ‘ఒక వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్  సమావేశం నిర్వహిస్తోంది.

ఈ సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల సీఎంలు పాల్గొని దేశ సమగ్రాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. ఈ ముగ్గురిలో రేవంత్ రెడ్డి ఇండియా కూటమికి చెందిన సీఎం కాగా.. చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. కాగా రెండు రోజుల క్రితం దావోస్ కు వెళ్లేందుకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news