శృంగారం: ముద్దు ప్రత్యేకం అవడానికి దాని వెనక ఉన్న సైన్స్ తెలుసా?

-

మీకు నచ్చిన వారిపై ప్రేమని మాటల్లో చెప్పలేనపుడు, ఏదైనా బహుమతిగా ఇస్తే బాగుంటుందనుకుని షాపుకి వెళ్తే, అక్కడ ఏది చూసినా, దీని కన్నా బాగుండేది కావాలని అనిపించినపుడు, మరో పది షాపులు తిరిగి, అక్కడ కూడా లేదనిపించుకున్నాక, ఒట్టి చేతులతో వారి దగ్గరకు వెళ్ళినపుడు, వారి కళ్ళలో కనిపించిన ఆనందాన్ని మరింత పెద్దగా చేసేందుకు ఏదైనా కావాలని మీరనుకున్నప్పుడు, అవతలి వారు అమాంతం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో ఇంతకన్నా మంచిది ఇంకేదీ లేదని మీకు అనిపించి, తిరిగి మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు కలిగే ప్రేమని చెప్పడం అసాధ్యం.

ముద్దు.. ఇరువురి మధ్య ప్రేమను తెలుపుతుంది. ఆకర్షణ భావాన్ని మరింత పెంచుతుంది. దాన్నుండి ప్రేమ పెరుగుతుంది. ప్రేమలో ఇంత ప్రాధాన్యం ఉన్న ముద్దు వెనక సైన్స్ దాగుందన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముద్దు అనేది చాలా సున్నితం. ఎందుకంటే శరీరంలో సున్నిత భాగాలైన పెదవుల ద్వారా దాన్ని ఇస్తాం కాబట్టి. శరీరంలోని ఇతర భాగాలన్నీ వస్త్రంతో కప్పబడి ఉన్నప్పుడు బయటకు కనిపించే ముఖ భాగంలోని సున్నితమైన పెదవుల ద్వారా అవతలి వారికి ప్రేమను తెలియబరుస్తారు. అందుకే ముద్దు చాలా సున్నితమైనది. మీకిది తెలుసా? వస్త్రాలు ఎక్కువగా కప్పుకోని వ్యక్తులు ముద్దుని ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. ఈ మేరకు అడవుల్లో ఉండే గిరిజనుల సంస్కృతి మీద అధ్యయనం చేసిన ఆంత్రోపాలజిస్టులు ఈ మాట చెబుతున్నారు.

వారి శరీరంలో ఎక్కువ భాగం వస్త్రాలతో కప్పబడి ఉండదు. అందువల్ల ముద్దు పట్ల ఉత్తేజితం కారు. ముద్దు పెట్టుకున్నప్పుడు అవతలి వారి మనసు కనిపిస్తుంది. వారి సామీప్యంలో సరిగమలు వినబడతాయి. అది ముద్దు తీవ్రతను మరింతగా పెంచుతుంది. లేదంటే అవతలి వారు తమపై ప్రేమ తగ్గిపోయిందని అనుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news