ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

-

వివిధ కారణాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో ఈ విధంగా ఫాలో అయితే ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు. అయితే మరియు వాటి నుండి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు చూసేయండి.

సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోండి:

సమయాన్ని మేనేజ్ చేసుకోవడం వల్ల పనులు సులభంగా అవుతాయి. అదే విధంగా ఒత్తిడి కూడా ఉండదు. కాబట్టి మీకు ఎప్పుడైనా షెడ్యుల్ ఎక్కువగా ఉంటే కచ్చితంగా టైం ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది.

స్నానం చేయడం:

ఒత్తిడి తగ్గాలంటే మంచి రెఫ్రెషింగ్ బాత్ చేయడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా ఒత్తిడి ఉన్నప్పుడు ప్రయత్నం చేసి చూడండి.

హైడ్రేట్:

ఒత్తిడి బాగా ఎక్కువ ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని కారణంగా డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇటువంటి సమయంలో మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చు.

స్ట్రెచెస్ చేయడం:

ఒత్తిడి తగ్గాలంటే స్ట్రెచెస్ చేస్తూ ఉండండి. పది నిమిషాల పాటు యోగాని కానీ డాన్స్ కానీ వర్క్ అవుట్ వంటివి ప్రయత్నం చేసి చూడండి. ఇది కూడా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

బ్రేక్స్ తీసుకోండి:

కొన్ని కొన్ని సార్లు ఎక్కువ పనులు ఉన్నప్పుడు కాస్త విరామం ఇవ్వండి. ఇలా విరామం ఇచ్చి పనులు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. అదే విధంగా పని కూడా వేగంగా అయిపోతుంది కాబట్టి ఇలా కూడా ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news