రామ్ దేవ్ బాబా పై 420 కేసు..! పీకల్లోతు కష్టాల్లో పతంజలి..!

-

420 section case filed on ram dev baba and acharya balakrishna
420 section case filed on ram dev baba and acharya balakrishna

యోగా గురు రామ్ దేవ్ బాబా పై అతని వ్యాపారా భాగస్వామి పంతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణ తో పాటు మరో ముగ్గిరి పై 420 కేసుతో పాటు మరిన్ని సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఎఫ్‌ఐ‌ఆర్ లు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కారోనా ను తగ్గించే మందును తమ సంస్థ కనుగొనట్టు దానికి కరోనిల్ అని పేరు పెట్టి త్వరలో మార్కెట్ లో విడుదల చేయబోతున్నామని యగా గురు రామ్ దేవ్ బాబా చెప్పిన విషయం తెలిసిందే.

ఈ విషయం పై దేశ వ్యాప్తంగా అనేక చర్చలు డిబేట్ లు జరిగాయి. కొందరు ప్రకటనను ఆహ్వానిస్తుంటే మరి కొందరు తిరస్కరిస్తున్నారు ఇక ఈ నేపద్యంలో ఉత్తరాఖండ్ సర్కారు, ఔషధానికి సంబంధించిన అన్ని వివరాలు, క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందించాలని ఆదేశించింది. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గును తగ్గించే ఓ మందును తయారు చేస్తున్నామని మాత్రమే పతంజలి సంస్థ తమను సంప్రదించిందని, ఈ డాక్యుమెంట్లలో కరోనా ప్రస్తావనే లేదని ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఈ మందు కరోనాను ఎలా తగ్గిస్తుంది? ఎవరిలో వైరస్ ను తగ్గించింది? తదితర వివరాలు అందించాలని ఆదేశించింది. కాగా దేశ వ్యాప్తంగా రామ్ దేవ్ బాబా పై ఆచార్య బాలకృష్ణ పై అనేక కేసులు నమోదయ్యాయి.

ఈ నేపద్యంలో బల్బీర్ జక్కర్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420తో పాటు పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశామని జైపూర్ డీసీపీ అవినాష్ పరాశర్ మీడియాకు వెల్లడించారు. రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ, బల్బీర్ సింగ్ తోమర్, అనురాగ్ తోమర్, వర్షిణిలపై కేసు పెట్టామని, వీరిపై డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ చట్టం, 1954 కింద కూడా కేసు ఉందని తెలిపారు. ఇలా ఒక్కసారిగా కేసులు నమోడవ్వడంతో రామ్ దేవ్ బాబా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version