వియ‌త్నాంలో కొత్త‌ర‌కం వైర‌స్‌.. గాలిలో వేగంగా వ్యాప్తి!

ఇప్ప‌టికే కొవిడ్‌-19 చాలా ర‌కాల వేరియంట్లు మ్యుటేష‌న్ అయి ద‌డ పుట్టిస్తోంది. రోజుకో కొత్త‌ర‌కం వేరియంట్లతో జ‌నాల‌ను బెంబేలెత్తిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ్రిట‌న్‌, ఇండియాలో వేరియంట్లే డేంజ‌ర్ అనుకుంటే.. ఇప్పుడు వియ‌త్నాంలో కొత్త‌ర‌కం వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది. ఈ వేరియంట్ బ్రిట‌న్‌, ఇండియా వేరియంట్లు మ్యుటేష‌న్ కావ‌డం వల్ల ఏర్ప‌డిన కొత్త ర‌కం.

ఇది చాలా డేంజ‌ర్ అని వియ‌త్నాం తెలిపింది. ఈ కొత్త ర‌కం వైర‌స్ గాలిలో వేగంగా వ్యాపిస్తోంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి గుయెన్ థాన్‌లాంగ్ వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వియ‌త్నాంలో ఏడు ర‌కాల కొత్త వేరియంట్లను గుర్తించామ‌ని, ఇందులో బ్రిట‌న్‌, ఇండియా వేరియంట్లే అత్యంత డేంజ‌ర్ అని వివ‌రించారు. ఇక సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు కూడా త‌మ దేశంలో గుర్తించామ‌న్నారు. అయితే ఇప్పుడు ఇండియా, బ్రిట‌న్ వేరియంట్లు మ్యుటేష‌న్ గా మారి కొత్త‌ర‌కం వైర‌స్ కేసులు పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. గ‌త ఏప్రిల్‌లో 6,856కేసులు న‌మోద‌వ‌గా.. ఇందులో కొత్త ర‌కం కేసులే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.