ఏపీలో కొత్తగా 9,999 కేసులు, 77 మరణాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఏ రోజూ పది వేలకి తక్కువ కేసులు నమోదు కావడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా కేసుల నమోదును కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 77 మరణాలు సంభవించాయి. అలాగే నేడు 11,069 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ap-corona
ap-corona

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,47,686కి చేరింది. ఇందులో 96,191 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా 4,46,716 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 4,779కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,52,128 టెస్టులు జరిగాయి. చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.