కరోనా వైరస్: రాష్ట్రాల్లో కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ గురించి పూర్తి సమాచారం…!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీనితో చాలా రాష్ట్రాలలో కొత్త నిబంధనలు జారీ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే నైట్ కర్ఫ్యూ లాంటివి చేసి కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్ కేసులు భారతదేశంలో 1.50 కోట్లు కేవలం ఒక్క రోజులోనే నమోదయ్యాయి అయితే ఏఏ రాష్ట్రాల్లో ఎటువంటి నిబంధనలు పెట్టారు అనేది రోజు చూద్దాం..!

ఐజ్వాల్:

మంగళవారం నుంచి ఇక్కడ లాక్ డౌన్ విధించారు. ఐజ్వాల్ మున్సిపల్ ఏరియా మరియు 10 జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకూ రాకూడదు అని చెప్పడం జరిగింది.

ఉత్తర ప్రదేశ్:

అలహాబాద్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్ మరియు గోరకపూర్ లో ఒక వారం పాటు లాక్ డౌన్ విధించారు. నిత్య అవసరాలు తప్ప అన్ని మూసివేశారు.

చండీగర్:

చండీగర్ లో ఒక ఊరు నుంచి కానీ ఒక స్టేట్ నుంచి కానీ రావాలి అంటే పర్మిషన్ తీసుకుని మాత్రమే రావాలని అన్నారు. చండీగర్ లో కేవలం వీకెండ్ లాక్ డౌన్ పెట్టారు. అది శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ చేశారు.

కేరళ :

కేరళలో నైట్ కర్ఫ్యూ విధించారు. అలానే కంటెంట్మెంట్ జోన్స్ లో పూర్తిగా మూసివేశారు.

కర్ణాటక:

పలు మీటింగ్ల తర్వాత కర్ణాటకలో మంగళవారం నాడు నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో కేవలం నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉండాలని చెప్పారు. బెంగళూర్, మైసూర్, మంగళూరు అలానే మూడు చోట్ల రాత్రి ఖర్చు ఉంటుందని.. అది రాత్రి పది నుంచి ఉదయం 5 వరకు ఉంటుందని చెప్పారు.

ఢిల్లీ:

మళ్లీ సోమవారం వరకు ఢిల్లీలో కార్ఫ్యు ఉంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. షాపులు నడపడానికి మందులు, కూరగాయలు, పండ్లు, పాలు అమ్మేవాళ్ళకి… బ్యాంకు లో పని చేసే వాళ్ళకి ఇంటర్నెట్ సేవ సర్వీసుల్లో పని చేసే వాళ్ళకి పెట్రోల్ బంక్ లో పని చేసే వాళ్ళకి ఈ పాస్ లు ఉంటాయని చెప్పారు. అలానే పెళ్ళిళ్ళకి మరియు అంత్యక్రియలకి 50 నుంచి 20 మంది మాత్రమే అటెండ్ అవ్వాలి అన్నారు.

మహారాష్ట్ర:

14 ఏప్రిల్ నుంచి మే 1 వరకు కర్ఫ్యూ విధించారు. నిత్యావసరాలు తప్ప అన్ని మూసివేశారు.

పంజాబ్:

పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు ఇక్కడ కర్ఫ్యూ ఉంటుంది.

రాజస్థాన్ :

రాజస్థాన్లో వీకెండ్ కర్ఫ్యూ పెట్టారు. ఇది రెండు వారాల పాటు ఉంటుంది. మే 3 వరకు ఇక్కడ కర్ఫ్యూ ఉండనుంది.

చత్తీస్గర్:

త్తీస్గఢ్లో మూడు జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ పెట్టారు మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు.

జమ్మూ అండ్ కాశ్మీర్:

ఇక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు. 8 జిల్లాలలో కేసులు ఎక్కువగా రావడంతో అక్కడ నైట్ కర్ఫ్యూ పెట్టారు.

ఒడిశా:

ఏప్రిల్ 5 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. గుజరాత్ లో 20 సిటీస్ లో రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.

హర్యానా:

హర్యానాలో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు ఇక్కడ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించారు. (మరి కొన్ని రాష్ట్రాల సమాచారం ఇవ్వాల్సి వుంది)