స్లో ఓవర్‌ రేట్… కెప్టెన్‌పై నిషేధం ఎప్పుడు విధిస్తారంటే..!

-

కరోనా నేపథ్యంలో బయో బబుల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా కొనసాగుతూ క్రికెట్ అభిమానులను ఎంతో వినోదాన్ని పంచుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సారి ఐపీఎల్‌ ప్రారంభమయినప్పటి నుంచి ఇద్దరు కెప్టెన్లకు స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జ‌రిమానా పడగా… తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు.

కాగా ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం స్లో ఓవర్‌ రేట్ నిబంధనలు ఇలా ఉన్నాయి. మొదటిసారి స్లో ఓవర్‌ రేట్ నమోదు చేస్తే ఆ జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. అలానే రెండోసారి కూడా స్లో ఓవర్‌ రేట్పునరావృతమైతే ఆ జట్టు కెప్టెన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించడంతో పాటు జట్టు కెప్టెన్‌ సహా ఆ మ్యాచ్‌కు తుది జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. ఇక మూడో సారి కూడా స్లో ఓవర్‌ రేట్ నమోదు అయితే ఈ సారి కెప్టెన్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం విధించడంతోపాటు రూ.30 లక్షల జరిమానా వేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news