కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సతమతం అవుతున్నారు. కరోనా corona కేసులు కూడా ఇంకా వస్తూనే వున్నాయి. ఇక కరోనా వైరస్ కేసుల కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. గత 24 గంటల్లో భారత్లో 32,906 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం తెలిపింది.
భారతదేశం యాక్టివ్ కేసులు 4,50,899 వద్ద ఉంది. COVID-19 కారణంగా దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 2020 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో మరణాలు 4,10,784 కు చేరుకున్నాయి.
మహమ్మారి ప్రారంభం నుండి కరోనా సోకిన వారిలో 3,00,14,713 మంది రోగులు ఇప్పటికే COVID-19 నుండి కోలుకున్నారు మరియు గత 24 గంటల్లో 49,007 మంది కోలుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మహమ్మారి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.