ఆ రాష్ట్రాలని చూసి యావత్ దేశం బుద్ధి తెచ్చుకోవాలి !

-

దేశంలో ఆర్థికంగా బలమైన రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ వంటి ధనిక రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. చాలా వరకు ఈ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి చూస్తుంటే వైరస్ కోలుకునే పరిస్థితి ఇప్పుడు అప్పుడే లేదని వైద్య నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది.మామూలుగా అయితే ఈశాన్య భారతంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా పేదరికానికి దగ్గరగా తీవ్రవాదానికి దగ్గరగా ఉంటాయి. ప్రజలు తమ దైనందిన జీవితాల్లో అభివృద్ధి చెందడానికి ఆ రాష్ట్రాలలో పెద్దగా కూడా ఉపాధి చేసుకోవడానికి ఏమీ లేని పరిస్థితులు. దేశానికి మారుమూల దూరంగా దేశ చిత్రపటంలో ఏదో మూల ఉండే ఈ రాష్ట్రాలలో కరోనా వైరస్ అసలు వ్యాప్తి చెంద కపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

యావత్ దేశం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న ప్రజలు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నారు. చాలా వరకు ఈశాన్య రాష్ట్రాలు కరోనా వైరస్ ని ఎదుర్కోవటం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాలలో ప్రకృతికి ఎక్కువగా పెద్దపీట వేయడంతో ఇప్పుడు ఈ వైరస్ నుండి ప్రకృతే వీళ్లను కాపాడుతుంది అని మేధావులు అంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలను చూసి మిగతా రాష్ట్రాలు కూడా బుద్ధి తెచ్చుకుని ప్రకృతికి పెద్దపీట వేయాలని కోరుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version