ఢిల్లీలో కరోనా ఆంక్షలు సడలింపు… స్కూళ్ల రీఓపెన్ కు అనుమతి

-

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి మూతపడ్డ స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9-12వ తరగతలకు… నర్సరీ నుండి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుండి బడులను పాఠాలు మొదలు కానున్నాయి. వీటతో పాటు అన్ని రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు తెరిచేందుకు అనుమతి లభించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు 100% సామర్థ్యంతో పనిచేయడానికి పర్మిషన్లు వచ్చాయి. జిమ్‌లు మరియు స్విమ్మింగ్ పూల్స్ కూడా పూర్తిగా తెరవనున్నారు. మరోవైపు రాత్రి కర్ఫ్యూను ఒక గంట తగ్గించి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆంక్షలు సడలించాలంటూ.. ప్రభుత్వంతో ప్రజలు కోరుతున్నారు. తాజాగా ఈ అనుమతులతో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version