బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించిన శ్రీ రెడ్డి..!

-

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇలాంటి శ్రీ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ను పెట్టుకొని దాని ద్వారా అనేక రకాల వీడియోలను చేస్తూ అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ లో శ్రీ రెడ్డి ఫిట్నెస్ కు, వంటలకు సంబంధించిన వీడియోలను అలాగే రాజకీయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలపై ఇలా దేనిని వదిలిపెట్టకుండా అన్ని రకాల వాటిపై వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి, నందమూరి నటసింహం బాలకృష్ణ పై ప్రత్యేకంగా ఒక వీడియో చేసి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించింది. అఖండ మూవీపై అలాగే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆన్ స్టాపబుల్ టాక్ షో గురించి శ్రీ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించింది. శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాలకృష్ణకు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. బాల‌య్య మూవీ చూస్తే ఎవ‌డికైనా పూన‌కాలే రీజన్ తెలుసుకోవాల‌నుందా అంటూ ఈ వీడియోకు టైటిల్ ను పెట్టింది. బాలకృష్ణ అఖండ మూవీ అద్భుతంగా ఉంది అని కామెంట్స్ చేసింది.

ఈ మూవీలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు సూపర్ డూపర్ గా ఉన్నాయని అలాంటి డైలాగులు రాయ‌డం ఒక ఎత్తు అయితే అలాంటి డైలాగులు చెప్ప‌డం ఒక్క బాలకృష్ణ కే సాధ్యం అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. డైలాగుల‌ను అందంగా, భ‌యంక‌రంగా చెప్పాలంటే ఒక్క బాలకృష్ణ కే మాత్రమే వ‌చ్చ‌ని తెలిపింది. అంద‌రినీ చిరంజీవి, మ‌హేష్ బాబు ఇలా పిలుస్తామ‌ని కానీ బాల‌య్య‌ను ఒక్క‌డినే ముద్దుగా బాల‌య్య బాబు అని పిలుస్తామ‌ని తెలిపింది. ఎన్టీఆర్ కు ముద్దుల కొడుకు బాల‌య్య ఇప్ప‌టికీ ఆయ‌న‌ను త‌లుచుకుంటూ ఉంటారు అని శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. నాన్న‌గారి గారాల ప‌ట్టి బాల‌య్య అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా స‌క్సెస్ ఫుల్ రాజ‌కీయ‌నాయకుడిగా కొన‌సాగుతున్నారని శ్రీ రెడ్డి బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించింది. కారోనా లాంటి సీజన్ లో అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అని ఆ క్రెడిట్ మొత్తం బాలకృష్ణ కే దక్కుతుంది అని శ్రీ రెడ్డి తెలిపింది. అఖండ సినిమా 50 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్ లను సాధించి ఇప్పుడు ఓటిటి లో కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది అని శ్రీ రెడ్డి తెలియజేసింది. అన్ స్టాప‌బుల్ టాక్ షో రికార్డుల‌ను కూడా ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. ఇలా శ్రీ రెడ్డి, బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించింది

Read more RELATED
Recommended to you

Exit mobile version