కామారెడ్డి కేసులో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఈత రాకనే ముగ్గురు మృతి చెందినట్లు చెబుతున్నారు. కామారెడ్డిలో కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు చెరువులోకి దూకినట్లు గుర్తించారు పోలీసులు. మొదటగా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు లో దూకింది కానిస్టేబుల్ శృతి. అయితే… కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నం చేశారు ఎస్సై సాయి కుమార్, నిఖిల్.
ఇక శృతి తర్వాత దూకిన నిఖిల్, ఈత రాకపోవడం తో నిఖిల్ గల్లంతు అయ్యాడట. అయితే.. తనను కాపాడమని కానిస్టేబుల్ శృతి అడగడం తో చెరువులోకి దూకాడు ఎస్సై సాయి కుమార్. అయితే.. చెరువు పెద్దది కావడం తో సాయి కుమార్ కూడా నీట మునిగాడట. దీంతో… ముగ్గురికి ఈత రాకపోవడంతో…. ముగ్గురు మృతి చెందినట్లు చెబుతున్నారు. సాక్షులు, ఆధారాలు లేకపోవడం తో ఇంకా త్రీ సూసైడ్స్ మిస్టరీ వీడలేదు. ఇక నేడు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.