కరోనాతో పోరు.. యువ వైద్యుడి మృతి..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ కారణంగా సామాన్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీలే కాదు వైద్యులు విలవిలలాడుతున్నారు. ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ ఎంతో మంది వైద్యులు మహమ్మారికి బలయ్యారు. తాజాగా మధ్యప్రదేశ్‌ లో యువ వైద్యుడు నెల రోజులుగా మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశాడు.

doctor
doctor

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ లోని బుందేల్‌ ఖండ్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ డాక్టర్ అయిన శుభం ఉపాధ్యాయ (30) అక్టోబర్ 28న కోవిడ్ రోగులకు చికిత్స అందజేశారు. ఆ సమయంలో ఆయనకు పాజిటివ్‌గా పరీక్షించారు. అయితే నవంబర్ 10న పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని భోపాల్ ‌లోని చిరాయు మెడికల్‌ కాలేజీకి తరలించారు. వైరస్‌ సోకిన సమయంలోనే అతడికి ఊపిరితిత్తులపై దాడి చేసిందని వైద్యులు తెలిపారు. ఇక అతన్ని రక్షించేందుకు ఊపిరితిత్తుల మార్పిడి తప్పా మరో మార్గం లేదని చిరాయు హాస్పిటల్‌ వైద్యుడు అజయ్‌ గొయెంకా చెప్పారు.

అయితే శుభం ఉపాధ్యాయను చైన్నైకి తరలించాలని భావించారు. అయితే తమిళనాడులో నివర్‌ తుఫాను కారణంగా తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో పరిస్థితి విషమించి బుధవారం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో కొవిడ్‌ వారియర్‌ను కోల్పోయామంటూ ఆస్పత్రి వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. అంతకు ముందు కరోనా యోధుడి పరిస్థితిని రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి గోపాల్‌ భార్గవకు సమాచారం అందజేశారు. ఇక డాక్టర్‌ ఉపాధ్యాయ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని మంజూరు చేయాలని సీఎం శివరాజ్ ‌సింగ్‌ అధికారులకు సూచించారు. వైద్యుడిని చెన్నైకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, మంగళవారం నాటికి మధ్యప్రదేశ్‌ లో 1,96,511 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news