చాలా మందికి తరచు తలనొప్పి వస్తూ ఉంటుంది. టెన్షన్ వలన కూడా చాలా మంది తలనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. తల నొప్పి ఉండడం వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. టెన్షన్ తలనొప్పి ఉన్నట్లయితే తల పట్టేసినట్లు ఉంటుంది. తల చుట్టూ బిగుతుగా ఉంటుంది. తలనొప్పిని తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్యాల గురించి చూద్దాం. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ని ఫాలో అయితే టెన్షన్ తలనొప్పి నుండి రిలీఫ్ ఉంటుంది.
శ్వాస వ్యాయామాలు చేయండి. కండరాలని సండలించడం గైడెడ్ ఇమేజరీ వంటి పద్ధతులు మనసుని రిలాక్స్ గా ఉంచగలవు. టెన్షన్ తలనొప్పి నుండి బయటపడాలంటే వేడి లేదంటే చల్లటి ప్యాక్స్ పెట్టుకోండి. తల మీద కోల్డ్ ప్యాక్ లేదంటే హాట్ ప్యాక్ ని పెట్టుకుంటే ఈ తలనొప్పి తగ్గుతుంది టెన్షన్ తలనొప్పి రాకుండా ఉండాలంటే సరైన పోస్టర్ ని మెయింటైన్ చేయండి కండరాలని క్రమం తప్పకుండా స్ట్రెచ్ చేస్తే కండరాల ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
ప్రతిరోజు కూడా కాసేపు వ్యాయమం చేయండి ఈ వ్యాయామం కోసం మీరు సమయాన్ని ఇవ్వడం వలన ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. మనసు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది ఒత్తిడి వలన టెన్షన్ తలనొప్పి వస్తుంది. వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోండి. కొన్ని ఆహార పదార్థాలని తీసుకోవడం వలన కూడా ఇది వస్తుంది. హైడ్రేట్ గా ఉండడం ముఖ్యం. కళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇలా వీటిని పాటించినట్లయితే టెన్షన్ తలనొప్పి రాదు.