ఈ రాఖీపౌర్ణమి చాలా ప్రత్యేకం.. మళ్లీ 2037లోనే

-

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య
ప్రేమనురాగాలకు ప్రతీకగా రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి తిథి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చందమామ చాలా అందంగా ఉంటుంది.. అలాంటి చందమామ ఇంకా ఆకర్షణీయంగా, అందంగా కనువిందుచేయనుంది.

Next Blue Moon 2023 | Blue Moon August 2023 | Blue Moon Schedule | Star Walk

అది ఎప్పుడో కాదు.. ఈ రాఖీ పౌర్ణమి రోజునే . 2023 ఆగస్టు 30తేదీ బుధవారం రాత్రి అరుదైన సూపర్‌ బ్లూ మూన్‌ కనిపించనుంది. బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఫుల్‌ మూన్‌ కనిపిస్తే దానిని బ్లూ మూన్ అంటారు. ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్‌ మూన్‌. ఆగస్టు 1 వ తేదీన పౌర్ణమి రోజున పూర్తి చంద్రుడిని మనం చూశాం. ఈ విధంగా పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.

రెండు పౌర్ణమిలు ఒకే నెలలో రావు. మళ్లీ ఇలాంటిది వచ్చేది 2037లోనేనాసా వివరాల ప్రకారం.. బ్లూ సూపర్‌ మూన్‌ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలిపింది. ఒక్కోసారి బ్లూ సూపర్‌ మూన్‌ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. ఫుల్‌ మూన్‌ రోజు బ్లూ సపర్‌ మూన్‌ రావడానికి 3 శాతం అవకాశం ఉంటే, పౌర్ణమి రోజులో సూపర్‌ మూన్‌ రావడానికి 25శాతం అవకాశం ఉంటుందని తెలిపింది.ఆగస్టు ౩౦ వ తేదీన వచ్చే నిండు చంద్రుడు సూపర్‌ మూన్‌ , బ్లూ మూన్‌ కూడా. సూపర్‌ మూన్‌ అంటే సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. చంద్రుడు పరిభ్రమించ కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అదే సమయంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా సూపర్‌ మూన్‌ కనిపిస్తుంది.

ఇప్పుడు రాబోయే సూపర్‌ మూన్‌ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్‌ మూన్‌. బుధవారం కనిపించే చందమామ చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, నారింజ రంగులో కనిపించబోతోంది.ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు క్యాలెండర్ బ్లూ మూన్ ఏర్పడుతుంది. పౌర్ణమి ప్రతి 29.5 రోజులకు కనిపిస్తుంది, ఇది తప్పనిసరిగా ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు సంభవిస్తుంది. చంద్రుని దశలకు దాదాపు 29.5 రోజులు పడుతుంది, కాబట్టి ఒక సంవత్సరంలో సాధారణంగా 12 పౌర్ణమిలకు తగినంత సమయం ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఒక సంవత్సరంలో 13వ పౌర్ణమి కూడా వస్తుంది. దానిని బ్లూ మూన్ అని పిలుస్తాము.

Read more RELATED
Recommended to you

Latest news