కరోనా కేసుల్లో భారత్‌ 6వ స్థానం.. ఇటలీని దాటేసింది..!

-

కరోనా మహమ్మారి భారత్‌లో రోజు రోజుకీ విజృంభిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ ఎప్పటికప్పుడు పైకి ఎగబాకుతూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా కరోనా కేసుల సంఖ్యలో భారత్‌.. ఇటలీని దాటేసింది. భారత్‌ ప్రస్తుతం ప్రపంచ జాబితాలో 6వ స్థానానికి చేరుకుంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.35 లక్షలకు చేరుకుంది. దీంతో భారత్‌ ప్రపంచ దేశాల జాబితాలో ఇటలీని దాటి 6వ స్థానానికి చేరుకుంది. కాగా ఇప్పటికే చైనా సహా పలు ఇతర దేశాలను కూడా భారత్‌ అధిగమించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 9,887 కరోనా కేసులు నమోదు కాగా.. 294 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,36,781కు చేరుకుంది. అలాగే మొత్తం 6,649 మంది చనిపోయారు. ఈ క్రమంలో 1.15 లక్షలకు పైగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గడిచిన 20 రోజుల కాలంలో భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో రష్యా, యూకేలు నిలిచాయి. ఐదవ స్థానంలో స్పెయిన్‌ ఉండగా, 6వ స్థానంలో భారత్‌ ఉంది. మరికొద్ది రోజులు గడిస్తే ఆయా దేశాలను కూడా భారత్‌ అధిగమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version