ఈ నెల 9వ తేదీన చిరంజీవి నేతృత్వంలో కొందరు సినిమా ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కాబోతున్నారు. షూటింగ్ లు, సినిమా హాళ్ల ప్రారంభం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దగ్గరకు వెళ్లినప్పుడు తనను పిలవలేదని అలకబూని, ఫైరయిన బాలయ్యను ఈ మీటింగ్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ పిలవాలని భావించారట చిరు & కో! దీంతో ఈ భేటీకి బాలకృష్ణను కూడా ఆహ్వానించారట. అయితే.. చాలా మంది ఊహించినట్లుగానే… బాలయ్య ఈ మీటింగుకు గైర్హాజరవుతున్నారంట!
అదేంటి… రామారావుగారి అభిమాని కేసీఆర్ గారు.. ఆయన నన్ను పుత్రవాత్సల్యంతో చూస్తారు.. ఆయన్ను కలవడానికి తనను పిలిస్తే ఎందుకు రాను.. రాజకీయాలు వేరు – సినిమాలు వేరు.. ఇండస్ట్రీ అభివృద్ధికోసం ఎక్కడికైనా వస్తాను, అది తన బాధ్యత అన్న రేంజ్ లో చెప్పుకొచ్చిన బాలయ్య.. ఇలా తన వీరాభిమాని అయిన జగన్ ను కవలడానికి వెల్లలేకపోవడమేమిటి అని చర్చ మొదలైపోయింది. సినిమా ఇండస్ట్రీ ఇక ఏపీలో కూడా అభివృద్ధి చేయాలనే అతి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగబోతున్నప్పుడు బాలయ్య బాధ్యతను మరిచి గైర్హాజరవడం ఏమిటి? బాలయ్య అలా బాధ్యతలు మరిచే వ్యక్తి కాదే అనేది ఇండస్ట్రీ జనాల సందేహం!
అయితే… దీనికి బాలయ్య బర్త్ డే కారణం అని కొందరంటుంటే… అది 10న కదా అని సమాధానం! ఎందుకంటే… హైదరాబాద్ టు అమరావతి ఎలా వెళ్లినా 3 గంటలు… ఇంత ముఖ్యమైన పనికి బాలయ్య వెల్లడం మర్యాద, పెద్దరికం, అంతకు మించి బాధ్యత కూడా! ఇక.. మొన్న పిలవలేదని అలకా అంటే… బాలయ్యకు అలకలు ఉండవు.. నచ్చకపోతే నిప్పులు కక్కుతున్న అగ్నిపర్వతం అవుతారు తప్ప అని సమాధానం!
బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం వల్లా అంటే… రాజకీయాలు వేరు – సినిమాలు వేరు అని బాలయ్యేకదా అంది. కేసీఆర్ – బాలయ్య ఏమైనా ఒక్కపార్టీలో ఉన్నారా లేక టీడీపీ ఏమైనా తెరాసకు మిత్రపక్షమా.. అని సమాధానం! మరి ఎందుకు? చంద్రబాబు ఏమైనా అనుకుంటారని బాలయ్య భయపడుతున్నారా? అంటే మాత్రం సమాధానం రావడం లేదు! దీంతో… జగన్ తో మీటింగుకు వెళ్లమంటున్న బాధ్యత… బాబు ఉన్నారు అని గుర్తు చేస్తున్న భయం… వీటిమధ్య బాలయ్య నలిగిపోతున్నారంట!?