రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

-

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, మాస్క్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, అది ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు మాస్కులు ధరించడం అనే అంశం చర్చకి వచ్చింది.

మాస్క్ మీద మాస్క్ పెట్టుకుంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా అనే ప్రశ్నకి తక్కువగా ఉంటుందనే సమాధానాలు వస్తున్నాయి. జామా ఇంటర్నల్ పరిశోధనలో ప్రచురితమైన దాన్ని బట్టి చూస్తే సర్జికల్ మాస్క్ ధరించి దానిపై వస్త్రంతో చేసిన మాస్కుని ధరించాలని, కరోనా విస్తరణ తగ్గడానికి అది బాగా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక దూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించి అన్ని విధాలా జాగ్రత్తగా ఉంటే కరోనా వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు.

రెండు మాస్కులు ధరించాలన్న ఆలోచన ఉన్నవారు సర్జరీ మాస్క్ ని లోపల ధరించి, పైన వస్త్రంతో తయారు చేసిన మాస్క్ ని ధరించాలి. లేదంటే, రెండు పొరలున్న మాస్కులని వాడినా మంచిదే అంటున్నారు. చిన్న చిన్న నీటి తుంపర్లు నోరు, ముక్కులోకి వెళ్ళకుండా రెండు పొరలున్న మాస్క్ అడ్డుకుంటుంది. అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఇదే చెప్పింది. ఒక మాస్క్ ధరించడం కంటే, రెండు పొరలున్న మాస్కులని లేదా రెండు మాస్కులని ధరించాలని చెప్పింది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్న వేళ కరోనా బారిన పడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version