అమవాస్యకు బాంబులు కొన్నాడు.. కార్తీక పౌర్ణమి వరకు పేలలేదు : కేటీఆర్

-

తుస్సు బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమవాస్య దీపావళికి కొన్న బాంబులు కార్తీక పౌర్ణమి వరకు కూడా పేలలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి 45 రోజులు అయినా ఎవ్వరూ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ  వాళ్లు, ఈడీ అధికారులు.. అందరూ నిశ్శబ్దం వహించారని పేర్కొన్నారు.

KTR

కాంగ్రెస్-బీజేపీ ల రహస్య అవగాహనకు ఇది నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. ఈడీ కవిత ఇంటిపైన, మరో ప్రతిపక్ష నేతపై దాడులు చేస్తే గుండు పిన్ను దొరికిన సమాచారం బహిర్గతమవుతాయన్నారు. ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్టు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొంటారు. తెలంగాణలో మేకల మండిలో కాంగ్రెస్ బాగా కొనుగోలు చేస్తుందని.. మా మేకలు తప్పిపోయి కాంగ్రెస్ మందలో తిరుగుతున్నాయని మా మేకలు పట్టుకొచ్చుకుంటామని మీరు ఇక్కడికి రండని పిలిచానని చురకలంటించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version