చైనా వూహన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి జనాలను ఇంకా భయపెడుతూనే ఉంది. రెండేళ్ల నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలుపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ముంబైలో ఓమిక్రాన్ XE వేరియంట్ ను గుర్తించారు. ఇదే దేశంలో నమోదైన తొలి ఓమిక్రాన్ XE వేరియంట్ కేసు. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
బ్రిటన్ లో తొలిసారిగా ఓమిక్రాన్ XE వేరియంట్ కేసు నమోదైంది. జనవరి 19న బ్రిటన్ లో తొలికేసు నమోదైంది. ప్రస్తుతం బ్రిటన్ దేశంలో ఈ రకం కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఓమిక్రాన్ కన్నా 10 రెట్ల వేగంగా ఓమిక్రాన్ XE వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.