కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం అన్ని చర్యలు చేపడుతున్నాయి ప్రపంచ దేశాలు. వైరస్ వ్యాప్తి నిరోధం చేయడం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి దాపురించింది. వైరస్ విరుగుడు కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి మందు కనిపెట్టడానికి అనేక పరిశోధనలు చేస్తున్నాయి. అయితే తాజాగా భారత దేశంలో మాత్రం ప్లాస్మా థెరపీ విధానం ద్వారా కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేంద్రం కూడా ప్లాస్మా థెరపీ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అతని దేహం లో తయారయ్యే యాంటీబాడీస్ అతను కోలుకున్న తర్వాత కూడా నెలలు తరబడి ప్లాస్మా లో ఉంటాయని వాటిని ఉపయోగించుకొని ఇతరులకు వైద్యం చేసే వీలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవి వ్యాక్సిన్ మాదిరిగానే పనిచేస్తున్నాయని తేల్చారు.
ఇప్పుడు కరోనా విషయంలోనూ చాలామంది వైద్య నిపుణులు ప్లాస్మా థెరపీ కరెక్ట్ అని అంటున్నారు. చైనా మరియు దక్షిణ కొరియాలో ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా కరోనా వైరస్ ను కట్టడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్లాస్మా థెరపీ లో సేకరించిన యాంటీబాడీస్ తో 2 నుంచి 4 డోస్ లు మాత్రమే తయారు చేసే వీలుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి ఒక డోసు మాత్రమే సరిపోతుందని వైద్యులు తేల్చారు. కరోనానుంచి కోలుకున్న 17 సంవత్సరాలు వయసు దాటిన వ్యక్తులన్నే దాతలుగా ఎంచుకుంటారు. వాళ్ళు కనీసం 55 కిలోల బరువు ఉండాలి. 14 రోజులు గా ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా ఉండాలి. అయితే ఎంత చేసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు లేకపోలేదు.