బండ్ల గణేశ్ కు కరోనా నెగిటివ్..! బండ్లన్న డ్యాన్స్ ఇరగదీశాడుగా…!

-

producer bandla ganesh posts his corona negative report
producer bandla ganesh posts his corona negative report

తెలంగాణలో కరోనా సెగలు రగిలిపోతున్నాయి. సినీ తారలు రాజకీయ నేతలు జర్నలిస్టులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ హోం శాఖా మంత్రి మహమూద్ అలీకి కూడా కరోనా సోకడం గమనార్హం. ఇక సినీ ప్రముఖుల్లో నటుడు నిర్మాత బండ్ల గణేశ్ గతంలో కరోనా మహమ్మారి బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ టెస్టులో ఆయనకు కరోనా నెగిటివ్ గా తేలడంతో ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన ట్విటర్ ఖాతా ద్వారా ఆయన కోవిడ్ టెస్ట్ రిపోర్టు ను పోస్ట్ చేశారు అందులో ఆయనకు కోవిడ్ 19 లేదు అని నెగిటివ్ అని తేలింది.. దీంతో హమ్మయ్యా… ! నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది అని ఆయన తన అభిమానులకు ఈ వార్తా తెలియజేశారు. దాంతో ఆయన అభిమానులు మారి డ్యాన్స్ వీడియో లో ధనుష్ ముఖానికి బండ్ల గణేశ్ ముఖాన్ని పెట్టి పోస్ట్ చేశారు.. దానికి బండ్ల గణేశ్ థాంక్ యూ అంటూ పోస్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version