కరోనా వ్యాక్సిన్ వల్ల సొరచేపలకి ముప్పు..

-

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో ప్రపంచ వైజ్ఞానికులందరూ నిమగ్నమయ్యారు. ప్రపంచ వ్యాప్త ప్రజల్ని పట్టి పిడిస్తున్న కరోనా వైరస్ ని నిర్మూలించడానికి వ్యాక్సిన్ అవసరమని, ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ మీకీ విషయం తెలుసా. ప్రపంచ జనాభాకి కరోనా వ్యాక్సిన్ ని అందించడానికి ఐదు లక్షల సొరచేపలు బలి కావాల్సి ఉంటుందట.

సొరచేపలకి కరోనా వ్యాక్సిన్ కి లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..

భూమ్మీద ఉన్న ప్రతీ జీవి మనకి ఏదో ఒకరకంగా సేవ చేస్తుంది. మనుషులు చేసే ప్రయోగాలు ముందుగా ప్రయోగించేది వాటి మీదే. అలాగే ఒక్కో జీవిలో ఉండే ప్రత్యేకమైన పదార్థాలు మానవాళికి ఎంతో ఉపయోగపడ్డాయి. వాటిని ఆ జంతువుల నుండి సేకరించడం వలన ఆ జాతి మనుగడకి ఆటంకాలు ఎదురయిన సందర్భాలు అనేకం.

ప్రస్తుతం సొరచేపల విషయంలో అలాగే జరగబోతుందని షార్క్ సపోర్ట్ గ్రూప్ తెలియజేస్తుంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో అవసరమయ్యే ఒకానొక ప్రత్యేక ఆయిల్ కోసం సొరచేపల్ని చంపాల్సి ఉంటుందట. ఆ ఆయిల్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుందట. ఆ ఆయిల్ ని స్క్వాలేన్ అంటారు. ఒక టన్ను స్క్వాలేన్ ఆయిల్ కావాలంటే 3000సొరచేపలని చంపాల్సి ఉంటుందట.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఒక్కో డోస్ కరోనా వ్యాక్సిన్ అవసరం అనుకుంటే 2,50,000 సొరచేపలు అవసరం అవుతాయట. రెండు డోసులు అవసరం అనుకుంటే 5లక్షల సొరచేపలు ప్రాణాలు పోవాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలో సొరచేపలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది షార్క్ సపోర్ట్ గ్రూప్ ఆందోళన పడుతుంది.

ఈ భూమ్మీద ఏది తక్కువైనా ఎక్కడో ఏదో ప్రమాదం జరుగుతుంటుంది. అన్నీ సమతౌల్యంగా ఉంటే అందరూ బాగుంటారు. వ్యాక్సిన్ వల్ల సొరచేపలకి నష్టం కలిగితే మానవాళికి కూడా నష్టం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version