అమెరికాలో కరోనా మరణ మృదంగం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. కొన్ని వేల ప్రాణాలు రోజు అమెరికాలో పోతున్నాయి. రోజురోజుకి కొత్త కేసులు మరియు మరణాలు సంభవించడం తో పరిస్థితి చాలా దారుణంగా మారింది. మరోవైపు కరోనా నీ ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది.
ఇటువంటి క్లిష్ట సమయం లో కొందరిలో ఆ వైరస్ లక్షణాలు ఏమీ కనపడవు, వారిలో వచ్చిందీ-వెళ్లింది ఏమీ తెలీదు. ఇలాంటి వారు క్యారియర్స్ గా మారి చాలామంది ప్రాణాలకు డేంజర్ గా మారుతారు అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయడమే పెద్ద సొల్యూషన్ అని అంటున్నారు. రెండు వారాల్లోగా అమెరికా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే దాదాపు కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని పేర్కొంటున్నారు.