100 మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించిన పూరి “ఇస్మార్ట్ శంకర్” ..!

-

చాలాకాలం తర్వాత డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించిన టెంపర్ సినిమా తర్వాత మళ్ళీ పూరి కి హిట్ దక్కలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్ని వరసగా ఫ్లాపువుతూ వచ్చాయి. దాంతో టాలీవుడ్ లో హీరోలు కాస్త పూరి కథ చెప్తానంటే వెనకడుగు వేశారు. దాంతో తన కొడుకునే హీరోగా పెట్టి మెహబూబా సినిమాని తీశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలింది.

 

ఆ తర్వాత రామ్ హీరోగా పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్స్ మీద ఇస్మార్ట్ శంకర్ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మళ్ళీ పూరి స్టామినా ఏంటో చూపించింది. ఈ సినిమాతో మొత్తం ఇస్మార్ట్ యూనిట్ కే బ్లాక్ బస్టర్ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ ని సాధించింది.

 

యూట్యూబ్ లో నాలుగు సినిమాలు 100 మిలియన్ వ్యూస్ సాధించి హీరోగా రాం రికార్డు సాధించాడు. ఇస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది. ఆదిత్య మూవీస్ ఇస్మార్ట్ శంకర్ హిందీ ప్రదర్శన హక్కులు సొంతం చేసుకోగా, ఫిబ్రవరి 16న యు ట్యూబ్ లో విడుదల చేశారు. అయితే విడుదలైన 45 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ హిందీ 100 మిలియన్ వ్యూస్ కి చేరుకొని రికార్డ్ సాధించింది.

ఇంతకముందు ఈ ఎనర్జ్టిక్ హీరో నటించిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ సినిమాలు హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ ఆ ఫీట్ నాలుగవ సారి సాధించాడు. సౌత్ ఇండియా మొత్తంలో ఈ రికార్డు సాధించిన ఒకే ఒక్క హీరోగా రామ్ నిలిచాడు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Woooohooooooo rocking ???????????? <a href=”https://t.co/klyhyyBhM3″>https://t.co/klyhyyBhM3</a></p>&mdash; Charmme Kaur (@Charmmeofficial) <a href=”https://twitter.com/Charmmeofficial/status/1255392304015331329?ref_src=twsrc%5Etfw”>April 29, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

Read more RELATED
Recommended to you

Exit mobile version