ఐపీఎల్‌ రద్దయితే పరిస్థితి ఏంటి..? బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా..?

-

కరోనా వైరస్‌ ప్రభావం కేవలం ప్రజలపైనే కాదు.. క్రీడలపై కూడా పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనే క్రీడలు, వాటికి సంబంధించిన ఈవెంట్లను స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఇక మన దేశంలో మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహణ సందేహంగా మారింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాల్సి వస్తే బీసీసీఐ భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ టోర్నీ నిర్వహణపై సందిగ్ధం నెలకొనగా… టోర్నీ రద్దయితే పరిస్థితి ఏమిటని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ పెద్దలు చెబుతున్నా.. విదేశీ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత్‌ అంత సుముఖంగా లేదని సమాచారం. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అక్కడి స్టేడియంలలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి.

ఇక ఈ సారి ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యం కాక టోర్నీ రద్దయితే బీసీసీఐకి ఏకంగా రూ.10వేల కోట్ల వరకు నష్టం వస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అదే జరిగితే బీసీసీఐకి తీవ్రమైన కష్టాలు వస్తాయని వారు అంటున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ విషయంపై ఏం చేస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. మరో 1, 2 రోజుల్లో ఐపీఎల్‌ 2020 టోర్నీ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version