కరోనా వ్యాక్సిన్‌ ఇంజెక్షన్‌ చేయించుకుంటే.. రూ.3.30 లక్షలు ఇస్తారు..!

-

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి కరోనా సోకగా.. భారత్‌లో ఇప్పటి వరకు 75 కేసులు నమోదయ్యాయి. నిత్యం టెస్ట్‌ సెంటర్లలో ఎన్నో వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు మరోవైపు సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక లండన్‌లోని ఓ సంస్థ ఇప్పటికే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. కానీ దాన్ని టెస్టు చేసేందుకు వారికి వాలంటీర్లు లభించడం లేదు. దీంతో ఆ కంపెనీ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది.

లండన్‌లోని క్వీన్‌ మేరీ బయో ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే దాన్ని మనుషులపై టెస్ట్‌ చేసేందుకు వాలంటీర్లు ఎవరూ దొరకడం లేదు. దీంతో ఆ కంపెనీ తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్‌ చేసుకుంటే 4588 డాలర్లు (దాదాపుగా రూ.3.30 లక్షలు) ఇస్తామని ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్‌ పనితీరును వారు పరీక్షించి దాన్ని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.

అయితే ఆ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారు 18 ఏళ్ల పైబడి ఉండాలి. అలాగే వారు యూకేలో నివసిస్తూ ఉండాలి. ఇక వ్యాక్సిన్‌ను తీసుకున్నాక 14 రోజుల పాటు వారి ల్యాబ్‌లోనే ఉండాలి. నిత్యం వారు సూచించిన డైట్‌ తీసుకోవడంతోపాటు ఎక్సర్‌సైజ్‌ కూడా చేయాల్సి ఉంటుంది. కాగా మరోవైపు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా ఇలాగే ఓ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దాని పరీక్షల కోసం ఇప్పటికే ఆ సంస్థ 35 మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఆ పరీక్షలు సఫలమైతే త్వరలో కరోనా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version