ఏపీలో రియల్ ఎస్టేట్ పెంచేందుకు చంద్రబాబు కొత్త ఉత్తర్వులు !

-

భ‌వ‌న నిర్మాణాలు,లేఅవుట్ల అనుమ‌తుల‌ నిబంధన లు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017,ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017 లో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవో లు జారీ చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్క‌ర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

Chandrababu new orders to increase real estate in AP

సంక్రాంతి కానుక‌గా బిల్డ‌ర్లు,డెవ‌ల‌ప‌ర్లు,ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌లు మార్పులు జీవోలు జారీ చేశారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న‌12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్ల‌కు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేసామన్నారు. 500 చ‌.మీ.పైబ‌డిన స్థ‌లాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ,స‌బ్ రిజిస్ట్రార్ లు తొల‌గించారు. రాష్ట్ర,జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థ‌లాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీ.స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న తొల‌గింంచామని వివరించారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేసిన ప్ర‌భుత్వం…వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని… తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు మంత్రి నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version