హోలీ రోజున ఈ విధంగా అనుసరిస్తే వ్యాపారంలో నష్టాలు వుండవు..!

అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తుంటారు. అయితే హోలీ రోజు మాత్రం ఈ విధంగా అనుసరిస్తే సమస్యలు తొలగి పోతాయి. అయితే మరి వాటి కోసం చూసేద్దాం.

ఎవరైనా కోరిన కోరికలు నెరవేరాలంటే అప్పుడు ఈ మంత్రాన్ని నవ దుర్గ యంత్రం పెట్టి చదవండి. ”త్రిపురహర భవానీ బాలా, రాజ మోహినీ అంతా శత్రువే. వింధ్య వాసినీ మమ చింతిత్ ఫలం, దేహి దేహి భువనేశ్వరీ స్వాహా”. రోజూ మీరు దీనిని 108 సార్లు చదివితే కూడా ఎంతో మంచిది. అనుకున్నవి జరుగుతాయి.

అదే ఒకవేళ కనుక మీకు వ్యాపారం లో సమస్యలు వున్నాయి అంటే అప్పుడు హోలీ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. అక్కడ శ్రీ హనుమంతే నమః అని 108 సార్లు జపించండి. ఇలా ఈ విధంగా ఫాలో అయితే వ్యాపారం లో ఇబ్బందులు వుండవు. కనుక తప్పకుండ హోలీ నాడు సమస్యలను తొలగించాలంటే ఈ విధంగా అనుసరిస్తే మంచిది. దానితో వ్యాపార సమస్యలు దూరం అవుతాయి. అలానే ఆనందంగా కూడా ఉండడానికి అవుతుంది. హోలీ రోజున ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటాన్ని కొనుగోలు చేస్తే కూడా మంచిది. దీని వలన సంపద వస్తుంది. కనుక హోలీ పండుగ నాడు ఇలా చెయ్యండి.