కోహ్లిపై ఎలాంటి భారం లేదు.. ప్ర‌త్య‌ర్థికి ఇక‌ చుక్క‌లే : మాక్స్ వెల్

-

xవిరాట్ కోహ్లిపై కెప్టెన్సీతో పాటు ఏ ఇత‌ర భారాలు లేవ‌ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్ స్టార్ ఆలౌ రౌండ‌ర్ గ్లెన్ మాక్స్ వెల్ అన్నారు. ఆయ‌నకు బాధ్య‌త‌లు లేక పోవ‌డం.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ఇబ్బందే అని అన్నారు. విరాట్ కోహ్లి ఇప్పుడు ఫ్రీ గా బ్యాటింగ్ చేస్తాడ‌ని.. దీంతో భారీ స్కోర్లు ఖాయ‌మ‌ని అన్నారు. కెప్టెన్ గా ఉన్న‌ప్పుడు అనేక బాధ్య‌త‌లు, ఇబ్బందులు ఉంటాయ‌ని అన్నారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి చాలా ఫ్రీ గా ఉన్నాని మాక్స్ వెల్ అన్నారు.

విరాట్ ఫ్రీ గా ఉంటే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లే అని అన్నారు. కెప్టెన్సీ భారం తొలిగిపోవ‌డంతో విరాట్ కోహ్లి భారీ స్కోర్లు చేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడ‌ని అన్నారు. ఈ ఐపీఎల్ లోనే కాకుండా త‌ర్వాతి సిరీస్ ల‌లో కూడా కోహ్లీ ఎలాంటి భారం లేకుండా బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. కాగ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు కెప్టెన్ బాధ్య‌తల నుంచి విరాట్ కోహ్లి త‌ప్పుకున్న విషయం తెలిసిందే.

కాగ గ‌త ఏడాది సీజ‌న్ త‌ర్వాతే విరాట్ కోహ్లీ త‌న కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో ప్ర‌స్తుతం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్ జ‌ట్టు త‌మ కెప్టెన్ గా ఫాఫ్ డు ప్లెసిస్ ను నియ‌మించుకుంది. కాగ ఇంక ఎనిమిది రోజుల్లోనే ఐపీఎల్ 2022 ప్రాంర‌భం కాబోతుంది. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడ‌టానికి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news