Hug day: మీ మనసులోని ప్రేమనంతా ఒక హగ్ ఇచ్చి చెప్పండి..

-

ఫిబ్రవరి నెల వచ్చిందంటే వాలంటైన్స్ డే గురించే చర్చలు వినిపిస్తాయి.. మనకు ప్రియమైన వారికి జీవితాంతం గురుండెలా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుంది.. ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.ప్రతిరోజు ప్రేమికులు రోజ్ డే, ప్రపోస్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే అని ప్రతిరోజు జరుపుకుంటారు. అయితే ఆ వారంలో హగ్ డే అనేది కూడా ప్రత్యేకమైన రోజు. ఒకరిపై ఒకరు ప్రేమను తెలిపేందుకు హగ్ డే బాగా ఉపయోగ పడుతుంది..


ఒక ప్రేమికులు మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈరోజులను జరుపుకుంటారు. ఇలా కేవలం ప్రేమికులే కాకుండా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు అలా ఎవరైనా సరే కనిపించిన వెంటనే ఒక్కసారి ప్రేమతో కౌగిలించుకుంటే ఆ సమయంలో ఎన్నో బాధలు దూరమయ్యాయి అన్నట్లుగా ఉంటాయి. అంతేకాకుండా కౌగిలించుకోవడం వల్ల మేము మీకు ఎప్పుడు తోడుగానే ఉంటాము అని అర్థం చెప్పినట్లుగా ఉంటుంది.ఇక ప్రేమికుల మధ్య కూడా అదే కౌగిలింత రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు అలిగిన బుజ్జగించేందుకు హగ్ చేసుకోవటం, వాళ్ళల్లో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేయడానికి కూడా హగ్ చేసుకోవడం, వారు బాధపడుతున్న కూడా ఆ బాధను దూరం చేసుకోవడం కోసం హగ్ చేసుకోని తమ ఓదార్పు, ప్రేమను వ్యక్తపరచవచ్చు.

ఒకజంట రెండు హృదయాల మధ్య బంధాన్ని మరింత ప్రియంగా మారుస్తుంది. హగ్ డే..అయితే ప్రేమికులు ఈ రోజున ప్రత్యేకంగా కలిసి అన్ని బాధలు మర్చిపోయి ఒకేసారి తము ప్రేమించిన వ్యక్తిని గట్టిగా హగ్ చేసుకుని సంతోషాన్ని పంచుకుంటారు. నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అన్నట్లుగా ఆ కౌగిలింత ద్వారా చెబుతారు.దూరంగా ఉన్నవాళ్లు మాత్రం ఈ కౌగిలింతను మిస్ అవుతూ ఉంటారు. వారికి దగ్గరికి వచ్చి కౌగిలించుకునే అంత సమయం, సందర్భం లేనప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ మాటలతో కౌగిలింతలో మునిగేలా చేయవచ్చు. ఇక అలాంటివారు మంచి మంచి కొటేషన్స్ తో వారిని కౌగిలించుకున్న అనుభూతిని కలిగించవచ్చు..ఇక ఆలస్యం ఎందుకు ఆ పని చెయ్యండి..మీ ప్రియమైనవారికి గట్టి హగ్ ఇచ్చి మరోసారి ప్రపోజ్ చెయ్యండి..అలా పడి ఉంటారంతే..హ్యాపీ హగ్ డే మై డియర్ లవ్ బర్డ్స్..

Read more RELATED
Recommended to you

Latest news