కోడిగుడ్డుతో గుండెకు ముప్పు ఉందా..?

-

కోడిగుడ్డు.. ఇది వెజ్‌టేరియన్, నాన్‌వెజ్‌టేరియన్లకు ఇష్టమైనది. ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ బుర్జీ, ఎగ్ పులుసు ఇలా ఎన్నిరకాలుగా అయినా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కూర వండటం చాలా ఈజీ కూడా. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. కోడిగుడ్డు మనకు బలం ఇస్తుందని చిన్నప్పటి నుంచి అమ్మ చెబుతూనే ఉంటుంది. రోజు స్కూల్‌కి వెళ్లేటప్పుడు లంచ్ బాక్స్‌లో ఓ ఉడకబెట్టిన గుడ్డు ఉండాల్సిందే. అయితే ఈ గుడ్డు నిజంగా మన శరీరానికి మంచిదేనా..? ఇటీవల చాలా మంది గుండెపోటుకు గురవుతున్న నేపథ్యంలో వారి ఆహారపుటలవాట్లు పరీక్షిస్తే చాలా మంది గుడ్డుప్రియులే కావడం గమనార్హం. ఈ క్రమంలో గుడ్డు గుండెకు మంచిదేనా అన్న సందేహం చాలా మందిలో కలుగుతోంది.

కోడిగుడ్డులో 8 కేలరీలు, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక ఉడకబెట్టిన గుడ్డును అల్పాహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్, ముఖ్యంగా ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ అధికంగా ఉండే గుడ్డు సొనలు(ఎగ్‌లో ఉండే పసుపురంగు భాగం) హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే గుడ్లు మన కొలెస్ట్రాల్ స్థాయులను ప్రభావితం చేయవని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ నివేదికలో తేలింది. అంటే గుడ్డు తినడం వల్ల గుండెకు ఎలాంటి ముప్పు ఉండదని తేల్చి చెప్పింది.

మన శరీరంలోని కొలెస్ట్రాల్‌లో ఎక్కువ భాగం కాలేయం ద్వారా తయారవుతుంది. మనం తినే కొలెస్ట్రాల్ శరీరం నుంచి రాదు. నివేదిక ప్రకారం కాలేయం ప్రధానంగా మన ఆహారంలో కొలెస్ట్రాల్‌ను సంతృప్త కొవ్వులు , ట్రాన్స్ ఫ్యాట్‌లతో ఉత్పత్తి చేస్తుంది, ఆహార కొలెస్ట్రాల్ కాదు. కాబట్టి గుడ్లలోని కొలెస్ట్రాల్ స్థాయి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ఎలాంటి పాత్ర ఉండదు. సంతృప్త కొవ్వు గురించి చింతిస్తున్నారా? ఒక పెద్ద గుడ్డు ఒకటిన్నర గ్రాముల సంతృప్త కొవ్వు కంటే కొంచెం ఎక్కువ.

నివేదిక ప్రకారం మీరు రోజుకు ఒక గుడ్డు తింటే కొలెస్ట్రాల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో నిర్వహించిన అనేక అధ్యయనాల ఫలితాల ప్రకారం “ప్రతిరోజూ గుడ్డు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధులు రావు” అని నివేదిక పేర్కొంది.

మరోవైపు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) 2020లో ఆహార కొలెస్ట్రాల్‌పై కొన్ని సూచనలను వెల్లడించింది. గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం లేదని AHA తెలిపింది. అయినా ఆహారంలో కొలెస్ట్రాల్ , సంతృప్త కొవ్వులు తీసుకోవడం గురించి ఆలోచించాలని AHA సూచిస్తుంది. గుడ్డు తినడం మంచిదే కానీ రోజుకు మూడుకు మించి తీసుకుంటే దీర్ఘకాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మనకు తెలిసిందేగా.. ‘అతి’ ఏదైనా మంచిది కాదని.

Read more RELATED
Recommended to you

Exit mobile version