నకిలీ వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఏది నిజమైన వార్త, ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు మనకి తరచు కనపడుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు చూసి మోసపోతున్నారు ఎంతో మంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ వార్త నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రతి రోజు చాలా మంది వాట్సాప్ ని ఓపెన్ చేసి నిద్ర లేస్తూ వుంటారు. ప్రతి ఒకరి లైఫ్ లో వాట్సాప్ ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ ద్వారా మనం మెసేజ్లు ని ఇతరులతో పంపించుకోవచ్చు. ఆడియో వీడియోలని కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సప్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలని తీసుకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త షికార్లు కొడుతోంది.
Claim: The Government of India has released a new #WhatsApp guideline to monitor chats and take action against people
▪️ This message is #FAKE
▪️The Government has released no such guideline pic.twitter.com/QfinjvOEtu
— PIB Fact Check (@PIBFactCheck) July 30, 2023
ఇందులో నిజం ఎంత..? ఇది నిజమా కాదా..? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ ని తీసుకురాలేదు. వాట్సాప్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇది నిజమైన వార్త కాదు. ఇది పట్టి నకిలీ వార్త మాత్రమే. అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తల్ని చూసి మోసపోకండి. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.