తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్ కు వెళ్లాడు గంగారం. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం.
అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో.. కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.