సాధారణంగా ఏదైనా దొంగతనం లేదా క్రైమ్ కేసులో అరెస్టు అయిన వారిని పోలీస్‌స్టేషన్‌లోని సెల్‌లో ఉంచుతారు. అనంతరం కోర్టులో హాజరు పరిచాక రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఆలోపు పోలీసులు నేరాన్ని రుజువు చేస్తే అతనికి కోర్టు శిక్ష విధించడం జరుగుతుంది. ఇదంతా న్యాయవ్యవస్థలో ఒక చట్టబద్ధమైన ప్రక్రియ.
కానీ, న్యాయవ్యవస్థను కొందరు పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న కేసుల్లో అరెస్టు అయిన వారిని పోలీస్ స్టేషన్లోనే ఉంచుకుని వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డాడు.కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో స్టేషన్లో వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.