ఐటీ రంగానికి మారుపేరు అయిన బెంగళూరులో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇంతకాలం తాము పని ఒత్తిడితో అలిసిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 8 గంటల పని విధానంతో పాటు ఆరోగ్యంతో కూడిన ఉద్యోగాలు కావాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
రోజుకు 16 గంటలు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బొమ్మను ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు దగ్ధం చేశారు. దీనంతటికీ పని ఒత్తిడి కారణం అవుతుందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీలో నైట్ ఫిష్ట్‌ల కారణంగా ఆరోగ్యాలు పాడువుతున్నాయని, 8 గంటల పనివిధానం కాస్త క్రమంగా పెరుగుతోందని వారు మండిపడుతున్నారు.