ఫ్యాక్ట్ చెక్: ఏటీఎం లో డబ్బులు తీసేముందు ఇలా చెయ్యమని ఆర్బీఐ చెప్పిందా..? నిజం ఎంత..?

-

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అన్న సరే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.

 

అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మరి నిజంగా అది నకిలీ వార్తా లేదంటే అందులో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.

ఏటీఎం కి సంబంధించి ఫ్రాడ్లు చాలా జరుగుతూనే ఉంటాయి. తరచు మనం ఏటీఎం కి సంబంధించి వార్తలు వింటూనే ఉంటాం. ఏటీఎం లో క్యాష్ డ్రా చేస్తున్నప్పుడు మోసం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వచ్చిన వార్త ఏమిటి అనేది చూస్తే.. ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకునే ముందు రెండు సార్లు క్యాన్సిల్ బటన్ ని ప్రెస్ చేయాలని… ఇలా ప్రెస్ చేయడం వల్ల మీ యొక్క పిన్ సురక్షితంగా ఉంటుందని ఇతరులు దొంగిలించారని ఆర్బీఐ చెప్పినట్లు వచ్చింది. అయితే నిజంగా ఆర్బీఐ ఈ విషయాన్ని చెప్పిందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివి ఏమీ చెప్పలేదు. ఏటీఎం దగ్గరికి వెళ్ళాక ట్రాన్సాక్షన్ చేసే ముందు రెండు సార్లు క్యాన్సర్ బటన్ ని ప్రెస్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్టేట్మెంట్ ని తీసుకు రాలేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. మీరు మీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేసుకోండి. అలానే ఏటీఎం కార్డు మీద పిన్ ని రాయకండి ఇలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు వచ్చిన వార్త మాత్రం అబద్ధం.

Read more RELATED
Recommended to you

Exit mobile version