ఫ్యాక్ట్ చెక్: ఆధార్ కార్డు ఉంటే ప్రతి నెలా రూ.3,000..?

-

సోషల్ మీడియాలో మనకి ఏదో ఒక నకిలీ వార్త కనపడుతూనే ఉంటుంది. ఇదేమి మనకి కొత్త కాదు. తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నమ్మశక్యంగా లేని వాటిని కూడా చాలా మంది నమ్మి అనవసరంగా మోసపోతూ వుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త ఒకటి వైరల్ గా మారింది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్లకి రూ.3,000 ని ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తుందని అందులో ఉంది. మరి నిజంగా 3000 రూపాయలని ఆధార కార్డు ఉన్న వాళ్లకి ప్రభుత్వం ఇస్తుందా ఇందులో నిజం ఎంత అన్నది చూస్తే ఇది వాటి ఫేక్ వార్త అని తెలుస్తుంది. కేంద్రం ఇటువంటి స్కీం గురించి ఏమి చెప్పలేదు. యూట్యూబ్ ఛానల్ సర్కారీ అప్డేట్ ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి మూడు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పింది కానీ ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. అనవసరంగా ఇలాంటి వార్తలు నమ్మద్దు.

అలానే ఆడపిల్లలకి నెలకి రూ.2,100 ని కేంద్రం ఇస్తుందంటూ వార్త వచ్చింది. అది కూడా నకిలీ వార్త మాత్రమే. కనుక అసలు ఇలాంటి వార్తలు నమ్మద్దు. ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు విపరీతంగా ఎక్కువైపోయాయి వీలైనంతవరకూ ఇటువంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి. అలానే పాన్ కార్డు ఉన్నవాళ్ళకి డబ్బులు వస్తాయని మహిళలకి డబ్బులు వస్తాయని ఇలా సర్కారీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తోంది ఇటువంటి వాటిని నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Latest news