ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంత…?

-

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి ఇంటి పట్టు ఉండడమే మంచిది. కరోనా వైరస్ నేపథ్యం లో సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్లు వచ్చాయి. తాజాగా మనం సోషల్ మీడియా లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న ఫోటోని చూసాము. ఆ ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోయింది. నెట్టింట్లో షికార్లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపించింది. అయితే అసలు ఆ ఫోటో లో నిజం ఎంత ఉంది అనే దాని పై ఇప్పుడు పలు విషయాలు చూద్దాం…!

తాజాగా ఒక వీడియో వారం నుంచి కూడా వైరల్ గా మారింది. కుంభమేళ లో జరిగిన ఉత్సవాలతో పాటుగా ఇతర ఉత్సవాలు జరిగాయని చెప్పడం జరిగింది. దీంతో నెటిజన్లు కూడా వాటి పై కామెంట్లు పెడుతున్నారు/ అయితే నిజంగా అంత మంది ముస్లింలు ఉన్న ఫోటో ఇఫ్తార్ సమయంలోది ఏనా అనే విషయం మనం చూస్తే…

 

అది ఫేక్ అని తేలింది. అయితే ఆ వీడియో హైదరాబాద్ లోని ఇఫ్తార్ సమయంలోది కాదని కానీ అది సంబల్, ఉత్తరప్రదేశ్ లో అంత్యక్రియలు జరిగినప్పటి ఫోటో అని తేలింది. ఆ ఫోటో లో మనం ఎక్కువ మంది జనాన్ని మసీదు నుండి వస్తూ ఉన్నట్లు చూడచ్చు.

మౌలానా అబ్దుల్ మోమిన్ నద్వి యొక్క అంత్యక్రియల లో ఫోటో అది. అంతే కాని ఇది హైదరాబాద్ లో జరిగిన ఇఫ్తార్ లోది ఇది కాదని తేలింది. ఫేక్ న్యూస్ ఇది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మూడు లక్షల వరకు కొత్త కేసులు నమోదు అయిపోయాయి. అదేవిధంగా గత 24 గంటల్లో చూసుకుంటే 2,104 మంది మరణించారు. 8,840 ఒక మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version