ఫ్యాక్ట్ చెక్:ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 6,000 విలువైన ఇంధన సబ్సిడీ బహుమతిని అందజేస్తోందా?

-

సోషల్ మీడియాలో ఎన్నో ఫ్రాడ్ మెసేజ్ లు రావడం నిత్యం మనం చూస్తూనే ఉంటాము..కొన్నిటిని నమ్మి జనాలు మోస పోతున్నారు. తాజాగా మరో వార్త చక్కర్లు కోడుతుంది..6,000 విలువైన ఇంధన సబ్సిడీ బహుమతిని గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ లక్కీ డ్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ ఇంధన సబ్సిడీ బహుమతిని అందజేస్తోందని మోసపూరిత లక్కీ డ్రా ప్రకటన పేర్కొంది.

 

ప్రశ్నాపత్రం ద్వారా మీరు రూ. 6,000 విలువైన బహుమతి కార్డును గెలుచుకునే అవకాశం ఉంటుంది. దాని కోసం మీరు మీ వ్యక్తిగత వివరాలను అందించాలి. ప్రభుత్వ నిజనిర్ధారణ విభాగం, ఈ లాటరీ స్కామ్ అని పిఐబి పేర్కొంది.ప్రభుత్వ పథకాలపై ఇలాంటి ఆఫర్లు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, ఇండియన్ రైల్వేస్, పవర్‌గ్రిడ్, ఇండియా పోస్ట్ మరియు సెయిల్ పేరుతో ఇలాంటి లక్కీ డ్రా సందేశాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇటువంటి అనేక సందేశాలు చెలామణిలో ఉన్నాయి మరియు కొనసాగుతున్న మహమ్మారి సమయంలో ఇవి మరింత పెరిగాయి.ఈ నకిలీ సైట్లు ఇలాంటి నకిలీ సందేశాల ద్వారా మీ డబ్బు మరియు సమాచారాన్ని దొంగిలించడానికి చూస్తాయి.అలాంటి ఫార్వార్డ్‌లను నమ్మవద్దు మరియు మీరు వేటలో పడకూడదనుకుంటే సరైన తనిఖీ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version